“ఈ బ్రిడ్జి ఎప్పుడు పుట్టిందో గాని చచ్చేదాకా టోలు ఒలుస్తోంది”
“తల క్రింద పుస్తకం స్వప్నం జ్ఞానోదయం”
ఇలా ఒక యాభై (యాభై అంటే యాభైయే) మినీ కవితలతో ఈ గ్రంథాన్ని అందించారు కవి. కొన్ని హత్తుకొన్నాయి. మరిన్ని మంచి మినీ కవితలు వ్రాసి కనీసం ’వంద’ మార్కు తాకాలన్న తపన కనిపించ లేదు ఈ కవిలో. నిరంతర కవితా సాధన చేసే పరిస్థితులు బహుశః లేవేమో ఈ కవికి. ఈ గ్రంథాన్నే వెనుకకు త్రిప్పి, తిరుగవేసి చూస్తే “ఓ పన్నెండు కవితలు” అన్న మరో గ్రంథంగా మారిపోతుంది. (అటు నుండి సగం – ఒక గ్రంథం; ఇటు నుండి సగం ఒక గ్రంథం అన్న మాట!) రెండో గ్రంథం శీర్షికలో ఉన్న నిర్లక్ష్యమే ఆ కవితలలోనూ కనిపిస్తుంది. పుస్తకాన్ని చూసాక- సత్తా ఉన్న కవే కాని, సాధన, నిబద్ధత తక్కువ అన్న భావన కలుగుతుంది.
ee book loni kavyalu bagunnayi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/garamchai